ఉన్నతాధికారుల వేధింపులు.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన గుంటూరు రైల్వే ఉద్యోగి!

  • గుంటూరు రైల్వేస్టేషన్ లో ఘటన
  • ఉన్నతాధికారుల నుంచి పవన్ కు వేధింపులు
  • ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
రైల్వేశాఖలో ఉన్నతాధికారుల వేధింపులు తాళలేని ఓ ఉద్యోగి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. రైల్వే స్టేషన్ లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన తోటి ఉద్యోగులు ఆయన్ను కాపాడారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గుంటూరులోని రైల్వేస్టేషన్ లో పవన్ కుమార్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవలికాలంలో ఆయనకు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురయిన పవన్ కుమార్ ఈరోజు ఆఫీసుకు వచ్చాడు. అనంతరం ‘ఈ వేధింపులను నేను భరించలేను. చచ్చిపోతా’ అంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు.

పక్కనే ఉన్న తోటి ఉద్యోగులు ఈ సందర్భంగా పవన్ ను అడ్డుకున్నారు. కాగా, ఈ వ్యవహారంలో ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కేసు నమోదుచేయలేదు. బాధితుడు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని గుంటూరు పోలీసులు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
RAILWAY
Guntur District
KEROSINE
SUICIDE
attempt

More Telugu News